చారిత్రిక అనివార్యతకి అద్దం.

దాదాపు రెండు వందల సంవత్సరాల చారిత్రిక పరిణామాన్ని రెండువందల పేజీలకు కుదించి చెప్పడం, కాని ఆ క్రమంలో, మనకి రచయిత ఏదో చెప్పకుండా వదిలిపెట్టేసాడని అనిపించకపోవడం మామూలు విషయం కాదు. తాను ఏ ఘట్టాల్ని చిత్రిస్తున్నాడో అక్కడ అతి సూక్ష్మ వివరాల్ని కూడా మనకి చెప్తూనే నిడివిమీద నియంత్రణ సాధించడం మామూలు విషయం కాదు.

విలువైన కథ

నా వరకూ నాకు, ఈ నవల చదివిన తరువాత, వెర్రియర్ ఎల్విన్, రెవరెండ్ రివన్ బర్గ్ వంటి వాళ్ళ రచనలు వెంటనే చదవాలనిపించింది. మన ప్రాంతాల్లో కూడా ఇటువంటి సాహిత్యం రావాలంటే ఇటువంటి రచనలు తెలుగులోకి రావడం అవశ్యం అని కూడా అనిపించింది.

సరిహద్దులు దాటిన సాంగత్యం

ఇప్పుడు ఈ దేశ స్ఫూర్తిని రాజకీయనాయకులు మంట కలుపుతున్న సమయంలో, ఇదిగో, ఇటువంటి రచయిత్రులు, అనువాదకులు, ఈ రాజకీయ నాయకులు మాట్లాడుతున్న మాటలు ఈ దేశప్రజల మాటలు కావనీ, ఈ దేశ ప్రజలు సరిహద్దుల్ని కోరుకోవడం లేదనీ, సరిహద్దుల్ని దాటిన సాంగత్యాన్ని కోరుకుంటున్నారనీ ఎలుగెత్తి చాటుతున్నారు.