గాంధీ పట్ల నమ్మకం ఆయనకు ఒక ఐడియాలజీలో భాగంగా రాలేదు. కామన్ సెన్స్ లో భాగంగా వచ్చింది. అందుకని, ఆయన తన జీవితపు మామూలు అనుభవాల్లో గాంధీని ఎలా అనుసరించాడో చూడటం నాకు చాలా చకితానుభవంగా ఉంది.
యుగయుగాల చీనా కవిత-21
ప్రవాస దుఃఖాన్ని వ్యక్తీకరించడంలో చీనా సాహిత్యంలో అటువంటి కవిత మరొకటి లేదు. అందులో బెంగ, అపరాధ భావం, అవమానం, వినష్టహృదయం మాత్రమే లేవు. నిజానికి అది ఒక ప్రదేశానికి దూరమైన దుఃఖం కాదు. తిరిగి రాని, ఎన్నటికీ తాను తిరిగి చూడలేని ఒక వైభవోజ్జ్వల శకం గురించిన దుఃఖం.
