అనేక అంతరాళాలు

తన చిత్రలేఖనాల నీడ తన కవితలమీద పడనివ్వలేదు. ఆయన ఒక చిత్రకారుడు కాకపోయినా, అసలు ఇవి ఆయన రాసిన కవితలని తెలియకపోయినా, ఆయన సంతకం లేకపోయినా కూడా, ఇవి మనల్ని ఆకట్టుకోకమానవు.

శక్తిమంతుడైన రచయిత

ఇరవయ్యేళ్ళ కిందటి మాట. నేను అప్పుడే శ్రీశైలం నుండి హైదరాబాదు వచ్చాను. చాలా ఏళ్ళు సాహిత్యానికీ, సాహిత్యబృందాలకీ దూరంగా ఉద్యోగజీవితంలో తలమున్కలుగా గడిపినవాణ్ణి. రాగానే తెలుగు సాహిత్యం గురించి నన్ను నేను అప్ డేట్ చేసుకునే పనిలో పడ్డాను. అందులో ఒక పని వందేళ్ళ తెలుగు కథా ప్రస్థానం నుంచి కొన్ని ప్రతినిథి కథల్ని ఎంపిక చేసి ఒక సంకలనంగా తీసుకురావడం. అందులో పూర్వదశాబ్దాల్లోని కథల గురించీ, కథకుల గురించీ నాకు సమస్య ఎదురుకాలేదుగాని, మరీ ఇటీవలి …