దామెర్ల రామారావు

అవి చూడగానే నాలో అంతదాకా ముడుచుకుని ఉన్న రెక్కలు ఒక్కసారిగా ఏటవాలుగా బయటికి పరుచుకున్నాయి. తక్కినపనులన్నీ పక్కన పెట్టి, ఏ ఏటి ఒడ్డుకో, ఏ లాకుల దగ్గరకో పోయి ఆ చెట్లనీ, ఆ నీళ్ళనీ, ఆ నీడల్నీ చిత్రించుకుంటూ గడపాలని అనిపించకుండా ఎలా ఉంటుంది?

యుగయుగాల చీనా కవిత-17

ఇటువంటి అలభ్య, ఆదర్శ జీవితాన్ని అతడు ఎంతో కొంత మేరకు జీవించగలిగాడని మనకు ఆ కవిత్వం సాక్ష్యమిస్తుంది. నాకు తెలిసి ప్రపంచ సాహిత్యంలో, తిరిగి ఇటువంటి నిర్మలానుభూతి కనిపించేది కబీర్ పదాల్లోనూ, చెకోవ్ కథల్లోనూ మాత్రమే.

యుగయుగాల చీనా కవిత-16

తావో యువాన్ మింగ్ కవిత్వం చదివినప్పుడు సంస్కృత సాహిత్యవేత్తలకు వాల్మీకి, కాళిదాసులు వర్ణించిన తపోవన సంస్కృతి గుర్తొస్తుంది. తమిళ సాహిత్య విద్యార్థికి అవ్వైయ్యారూ, తిరువళ్ళువరు గుర్తొస్తారు. గ్రీకు సాహిత్య విద్యార్థికి థియోక్రిటస్ గుర్తొస్తాడు. లాటిన్ సాహిత్యవేత్తకు వర్జిల్ రాసిన ఎకొలాగ్స్ గుర్తొస్తాయి. అమెరికన్ సాహిత్యవిద్యార్థికి రాబర్ట్ ఫ్రాస్ట్ గుర్తొస్తాడు. ఇక అన్నిటికన్నా మించి తెలుగు సాహిత్యాభిమానులకు బమ్మెర పోతన గుర్తొస్తాడు. ఆయన రాసిన 'ఇమ్మనుజేశ్వరాధముల' పద్యం గుర్తొస్తుంది.