ఎన్నేళ్ళు గానో ఎదురు చూసిన ఆ ఉత్తరం ఇన్నాళ్లకు నిన్న గుమ్మలక్ష్మీపురం మండలం టిక్కబాయిలో నా చేతికందింది.
బారామాసి
ఢిల్లీ నా మీద విసిరిన ఆ రంగుల వలలో ఉక్కిరిబిక్కిరి అవుతూనే విమానప్రయాణం పూర్తయ్యేలోపు ఆ పుస్తకం చదివేసాను. రాత్రి పదింటికి హైదరాబాదులో దిగేటప్పటికీ, నా గుండెలో రక్తం బదులు మామిడిపూల గాలి ప్రవహిస్తున్నదని నాకు తెలిసిపోయింది
విద్యారణ్య
ఏ జన్మ అనుబంధమో నాన్నా, నువ్వూ, నేనూ! మళ్లా ఏ జన్మలో కలుస్తామో!
