వారిద్దరూ ముస్లిములు. ఒకరిది బెంగాల్, మరొకరిది వారణాసి. ఆలపించిందేమో ఒక గుజరాతీ హిందూ కవి రాసిన కృష్ణలీలా కీర్తన. ఆ వీడియో క్లిప్ కింద ఉన్న వందలాది కామెంట్లలో ఒకరు రాసారు కదా: 'ఇద్దరు హిందువులు చేసిన అద్భుతమైన జుగల్ బందీ అది ' అని. కాని వాళ్ళిద్దరూ హిందువులూ కారు, ముస్లిములూ కారు. భారతీయులు.
శేష వస్త్రం
ఇది చదివిన తర్వాత, మీ జీవితాల్లో, బాల్యంలోనో, కౌమారంలోనో, నవయవ్వనంలోనో మీమీద ఇట్లా తమ ఆశీర్వాదాన్ని వర్షించిన మహనీయులు, మీ తల్లిదండ్రులో, అక్కచెల్లెళ్ళో, అన్నదమ్ములో, తొలిఉపాధ్యాయులో ఎవరో ఒకరు ఉండి ఉంటారు. వారిని ఒక్కసారి మనసారా స్మరించండి.
నాట్యధర్మి, లోకధర్మి
వాయిస్ ఓవర్ కి అనుగుణంగా విశాలమైన తెరమీద ఒక పక్కనుంచి అంగవస్త్రంతో, ముక్కుమీదకి జారుతున్న కళ్ళద్దాలూ, చేతికర్రతో ఒక నీడ కనిపించగానే కళాకేంద్రమంతా చప్పట్లతో మార్మ్రోగిపోయింది. ఆ ఛాయారూపం తెరకి ఈ కొసనుంచి ఆ కొసకి వెళ్ళేదాకా ఆ చప్పట్లు అట్లా మార్మ్రోగుతూనే ఉన్నాయి.
