భాస నాటక చక్రం

నాటకకర్తగా భాసుడు అత్యంత ప్రతిభావంతుడు, ఒక విధంగా చెప్పాలంటే అత్యాధునికుడు. షేక్స్పియర్ నాటకాలు రాసిన షేక్స్పియర్ ఎవరో మనకు ఇప్పటికీ తెలియకపోయినప్పటికీ, ఆ షేక్స్పియర్ నాటకప్రజ్ఞ ఎంత గొప్పదో , ఇప్పటికీ ఎవరో ఇతమిత్థంగా తెలియని ఆ భాసుడి రూపకప్రజ్ఞ కూడా అంతే గొప్పది.

కృషీవలుడు

ఇప్పుడు కృషీవలుడు చదువుతూ ఉంటే ఎంతో కొత్తగానూ, తాజాగానూ, అప్పుడే కోసి గంపకెత్తిన కూరగాయల రాశిలానూ, దోసపండ్ల బుట్టలానూ కనిపిస్తున్నది.

అలా బొమ్మలు గియ్యాలంటే ఎలా?

కాని ఇంత దూరం ప్రయాణించినా యూరపియన్-అమెరికన్ చిత్రకళకి తృప్తి లేదు. చీనాలో ప్రాచీన చిత్రకారులు చిత్రించిన కొండల్నీ, వెదురుపొదల్నీ, పువ్వుల్నీ, సీతాకోక చిలుకల్నీ చూసినప్పుడల్లా ఆధునిక చిత్రకారుడు అశాంతికిలోనవుతూనే ఉన్నాడు. ఎలాగు? అలా బొమ్మలు గియ్యాలంటే ఎలా?