ఇక తన సమాజాన్నీ, సంస్కృతినీ బతికించగల శక్తిగా రే భావించిన రెండవ స్ఫూర్తి బెంగాలీ గృహిణి. మనిషిని మనిషిగా దగ్గరకు తీసుకోగల నిష్కపటమైన ఆమె ఆదరణ. ఆతిథ్యం. ఒక మనిషి నీ అతిథిగా, ఆగంతుకుడిగా నీ ఇంటి తలుపు తట్టినప్పుడు అతడెవరు అని అనుమానించని విశాల హృదయం.
విశిష్ట ఉపాదానం
అక్కణ్ణుంచి పాశ్చాత్య విమర్శకులు ముందుకు పోలేకపోయారు. ఎందుకంటే, బోదిలేర్ ఆదిమపాపాన్ని నమ్మినంతగా, భగవదనుగ్రహాన్ని నమ్మినట్టుగా కనిపించలేదు వాళ్ళకి. కాని, పాశ్చాత్య విమర్శకులు ఎక్కడ ఆగిపోయారో, రాధాకృష్ణమూర్తిగారు అక్కణ్ణుంచి మొదలుపెట్టారు.
అతడే ఒక సముద్రం
రవి, స్వాతి కుమారి తమ అనువాదంలో హెమింగ్వే వాక్యంలోని ఆ మహిమను ఎంతవరకు పట్టుకున్నారో నాకు తెలియదు. ఎందుకంటే నేనిప్పటికీ ఆ ఇంగ్లీషు మూలం చదవలేదు కాబట్టి. కాని, తెలుగులో చదువుతున్నప్పుడు కొన్ని వాక్యాలు నన్ను బలంగా తాకకపోలేదు.
