ఆ బంభర నాదం

అలా ఒక రసజ్ఞుడు ఎలుగెత్తి, మేఘగంభీర స్వరంతో పద్యాలు చదువుతోంటే, భయంతో, భక్తితో, వినమ్రతతో అట్లా ఆ రోజు రాజమండ్రి ఆ ఉద్గాత ముందు చెవి ఒగ్గినిలబడిపోయినట్టుగా ఇప్పుడు ఏ పట్టణమేనా చెవి ఒగ్గడానికి సిద్ధంగా ఉందా? ఏమై పోయింది ఆ కాలం? ఆ రసజ్ఞులు? తే వందినః? తాః కథాః?

నివ్వెర పరిచిన పదం

సారంగపాణి రాసిన పదాల్లో జాతీయ పదాల పేరిట వర్గీకరించినవి ప్రధానంగా ఆనాటి సామాజిక స్థితిగతులకు అద్దం పడతాయి. మరీ ముఖ్యంగా రాయలసీమను కలచివేసిన కరువుకాటకాల యథార్థ చిత్రం ప్రజల భాషలో ఆ పదాల్లో చిత్రణకి వచ్చింది. కరువులో తినడానికి తిండిలేని ఒక రైతు కుటుంబం ఇంటికి ఒక యాచకుడు భిక్షకోసం వచ్చినప్పుడు అతడికి ఏమీ ఇవ్వలేకపోతున్న ఆ తల్లి వేదన చూడండి: ~ కిన్నరవాస్తా నిలబడుకుంటె- గింజలేద్డ దైతం యాడ అన్ని లేవె, యెందొల్లడ బెట్టిన అగిత్తెమ …

సజీవసంగీతాలు

అవి ప్రజల నాలుకలమీద నడయాడుతున్న సజీవసంగీతాలు. వాటిల్లో నుతులు ఉన్నాయి, స్తుతులు ఉన్నాయి, తత్త్వాలు ఉన్నాయి. కవి హృదయం నుంచి నేరుగా పల్లవించిన అంకురాలవి.