ఆ ప్రభుదర్శనం ఆమె స్వయంగా సాధించుకున్నది, ఆమె సొంతం. తనకీ, తన దేవుడికీ మధ్య మరొక మధ్యవర్తి అవసరం లేదామెకి. ఒక తోటతోనూ, తోటలో పాడే ఒక పిట్టతోనూ ఆమె నేరుగా స్వర్గానికి ప్రయాణించగలదు.
నిజమైన ఆస్తికురాలు
ఒక తేనెటీగలో భగవద్విలాసాన్ని చూడగలిగిన దార్శనికురాలు. సదా సంశయంతో, మృత్యువుతో తలపడుతూ, ఎప్పటికప్పుడు ఒక పక్షి కూజితంతోనో, ఒక వింతవెలుగుతోనో ఆత్మ అనశ్వరత్వాన్ని ప్రకటిస్తూ వచ్చిన నిజమైన ఆస్తికురాలు.
సాహిత్య పురస్కారం
మీకు రాయడానికీ, చదవడానికీ ఇంత సమయం ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతారు మిత్రులు. నేనేం చెప్తానంటే, సాహిత్యమే లేకపోతే నా ఉద్యోగ జీవితంలో నేను ఉన్మాదిని అయిపోయి ఉండేవాణ్ణని.
