మాయగీతము

లోరెలీ జర్మన్లో రైన్ నది ఒడ్డున ఉన్న ఒక నిటారు పర్వతశిఖరం. మర్మరమంగా ధ్వనించే శిఖరం అని దాని అర్థం. ఆ కొండ పక్కన ఆ నదిలో ఎన్నో నావలు సుడిగుండంలో చిక్కుకుని మునిగిపోయాయి. ఆ కొండమీద ఒక సుందరి ఉండి పాటలు పాడుతూ ఉంటుందనీ, పడవనడిపే వాళ్ళు ఆ పాట వింటూ దారితప్పి మరణిస్తుంటారనీ స్థానిక కథనం.

సిద్ధౌషధం

కవిగా ఆయన సర్వోన్నతుడు, కాని మనిషిగా బలహీనుడు, ఎంత మహావిషాదాన్ని చూసినా కూడా తన జీవితేచ్ఛ చల్లారని వాడు. 'పొద్దుటిపూట దీపంలాగా ఏ క్షణాన్నైయినా కొండెక్కేలాగా ఉంది' తన జీవితమని ఒక ఉత్తరంలో రాసుకున్నాడుగాని, ఆ నిశాంతవేళ కూడా సాయంసంధ్యాదీపంలాగా ప్రజ్వరిల్లాలనే తపించాడు.

ఇదిగో లోకానికి ఇది నా లేఖ

ఎమిలీ డికిన్ సన్ ని అనువదించడం కష్టం కాదు, దాదాపుగా దుస్సాధ్యం. ఎందుకంటే, ఆ విలక్షణమైన ఇంగ్లీషుని ఇంగ్లీషులోకి అనువదించడమే కష్టం, ఇక తెలుగులోకి తేవడం ఎట్లా? కాని సరోజిని గారు ఆ నిశ్శబ్ద్దాన్ని, ఆ వైశిష్ట్యాన్ని, ఆ మృదూక్తిని, ఆ అర్థోక్తిని ఎంతో సరళంగా అనుసృజించుకున్నారు.