ప్రథమ వాచకం, పెద్ద బాలశిక్ష

తన సంకలనాన్ని 'స్త్రీలకు ప్రథమ వాచకం అనీ, పురుషులకు పెద్ద బాలశిక్ష' అనీ సంకలనకర్త రాసుకున్నాడు. అయితే ఈ వాచకాన్నీ, ఈ పెద్దబాలశిక్షనీ నలుగురూ చదివేలా చేయవలసిన బాధ్యత మాత్రం మనదే.

రేడియం తవ్వితీయడం

ఈ కవితల్లో కవి కొన్ని సార్లు ఏకాకి, కొన్ని సార్లు మహాసాంఘికుడు, కొన్ని సార్లు కైదీ, కొన్ని సార్లు స్వేచ్ఛాగాయకుడు. రష్యాలో కవిత్వం ఒక జీవన్మరణ సమస్య అన్నాడు యెవ్తుషెంకో. ఈ సంకలనంలోని మహాకవులంతా మృత్యువుతో ముఖాముఖి నిలబడి కవిత్వం చెప్పినవారే.

పాతాళభైరవి

జానపదకథలన్నింటిలోనూ ఉండే అమాయికమైన నైతికతనే పాతాళభైరవిలో కూడా ఉన్నది. నువ్వు అదృష్టమ్మీదనో, మరొకరి శక్తి మీదనో ఆధారపడి ఎంతైనా సంపాదించవచ్చుగాక, అది నిలబడదు. కలకాలం నిలబడేదల్లా నువ్వు సొంతంగా ఏది సాధించగలవో అది మటుకే.

Exit mobile version
%%footer%%