స్వెత్లానా పుస్తకం చాలాకాలం కిందటే తెలుగులోకి వచ్చిందని తెలిసినప్పుడు ఎంత గర్వంగా అనిపించిందో, కాని ఆ పుస్తకం అప్పుడు చదవలేకపోయానే, ఎంత సిగ్గుగా ఉందో. ఆ పుస్తకమెట్లానూ తెలుగులోకి వచ్చింది కాబట్టి, Voices from Chernobyl నుండి ఒక వాజ్మూలాన్నిట్లా తెలుగు చేసాను.
ఆ రెండూ కలిసి ఒక జ్ఞాపిక
ఇప్పుడు కృష్ణా జిల్లా రచయితల సంఘంవారు 2015 సంవత్సరానికి ఆలూరి బైరాగి పురస్కారం నాకు అందించినప్పుడు మళ్ళా అట్లానే అనిపించింది. ఆ సంకల్పం లక్ష్మీప్రసాద్ గారిదో, పూర్ణచంద్, గుత్తికొండ సుబ్బారావుగార్లదో అనుకోవడం లేదు నేను.
ఒక జీవుడి ఇష్టం
గురజాడ, గాంధీ, విశ్వనాథ వంటివారి భావాల్లో సారూప్యత లేకపోయినప్పటికీ, వాళ్ళందరిలోనూ ఉమ్మడిగా కనవచ్చే అంశం, మాడర్నిటీని ధిక్కరించడమే. మాడర్నైజేషన్ ని ఒక కలోనియల్ ప్రక్రియగా నిదానించడంలో వారి జాగరూకత సరైనదేనని ఇప్పుడు మనకి తెలిసి వస్తున్నది.
