అయితే అందులో ఒకచోట, ఆ రచయిత ,అస్తిత్వవాదం గురించి ప్రస్తావిస్తూ 'కిర్క్ గార్డ్ అవునంటే సార్త్ర కాదంటాడు ' అని రాసాడు. ఆ వాక్యం నన్ను తీవ్రంగా వెంటాడింది. కిర్క్ గార్డ్, విచిత్రమైన పేరు. ఎవరతడు. అతడు దేన్ని అవునంటున్నాడు?
ఆ వేసవి విలాపం
అమెరికానుంచి రావెల సోమయ్యగారితో వాళ్ళబ్బాయి మనోహర్ నా కోసమొక బుట్టెడు కవిత్వం పంపించారు. ఆఫీసులో ఉండగా ఆ పూలబుట్ట, ఆ పళ్ళగంప నా చేతికందింది. చైనా, పర్షియా, యూరోప్ లనుంచి లాటిన్ అమెరికన్ దేశాలదాకా వికసించిన కవిత్వం.
అనువాదమంటే కొత్తరక్తం ఎక్కించడం
ఒక భాషలో కవిత్వం మరో భాషలోకి అనువాదమయ్యేటప్పుడు అన్నిటికన్నా ముందు నష్టపోయేది సంగీతమనేది అందరూ అంగీకరించిన విషయమే. ఆ మాట నేనింతకు ముందు రాసాను కూడా. భాషల పరిమితుల్ని దాటి ప్రవహించేవి మెటఫర్, మూడ్,భావజాలం మాత్రమే అని కూడా రాసాను.
