నిన్న రామారావు కన్నెగంటి ఫేస్ బుక్ లో ఇన్నిస్ ఫ్రీ చెరువు దగ్గరికి వెళ్ళి ఫొటో తీసి 'భద్రుడూ, ఇది మీ శరభవరం' అని రాసి నన్ను సంతోష సంభ్రమానికి గురిచేసాడు.
చిన్నప్పటి నెగడి
మొన్న ఇంటికి వచ్చేటప్పటికి ఎక్కడో దూరదేశాన్నుంచి నన్ను వెతుక్కుంటూ వచ్చిన ప్రియబంధువులాగా హేరీ మార్టిన్సన్ కవితాసంపుటి The Procession of Memories, Selected Poems 1929-1945 నా కోసం ఎదురుచూస్తూ ఉంది.
పెరిక్లిజ్, ప్రిన్స్ ఆఫ్ టైర్
షేక్ స్పియర్ 'పెరిక్లిజ్, ప్రిన్స్ ఆఫ్ టైర్ 'చదవడం పూర్తి చేసాను. చదవడం కన్నా అధ్యయనం అనడం బాగుంటుందేమో. 'న్యూ కేంబ్రిడ్జి షేక్ స్పియర్ సిరీస్' లో డొరెన్ డెల్వెషియో, అంటొని హామండ్ అనే సంకలనకర్తలు పరిష్కరించిన ప్రతి.
