మనుషులు సామాజికంగా విముక్తి చెందడానికి సాగించే పోరాటంలో మూడు దశలుంటాయి. మొదటి దశలో మేము కూడా మనుషులమే అని చెప్పుకోడానికీ, గుర్తింపు పొందడానికీ చేసే పోరాటం నడుస్తుంది. ఆ తర్వాతి దశలో తక్కిన మనుషులతో పాటు సామాజికంగా సమానావకాశాలకోసం పోరాటం నడుస్తుంది. మూడవదశలో వాళ్ళు తాము కూడా శ్రేష్ఠమానవులం కాగలమని పోరాడి నిరూపించే దశ ఉంటుంది.