కాని తర్వాత రోజుల్లో మా తల్లిదండ్రులిద్దరూ ఒక్కసారే మమ్మల్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు తిరిగి చిత్రలేఖనం రూపంలో ఆయనే నన్ను అక్కున చేర్చుకున్నారు.
పునర్యానం-4
కానీ అంతకన్నా ముఖ్యమైన విషయం మన అనుభవాలు, ఆలోచనలు, ఊహలు, జ్ఞాపకాలు- వీటన్నిటి వల్లా దృశ్య ప్రపంచం ఎప్పటికప్పుడు మరింత వైయక్తికంగా మారిపోతూ ఉంటుంది.
పునర్యానం-1
నిర్వికల్ప సంగీతం కవిత్వం సంపుటి వెలువరించిన తర్వాత నాకొక కావ్యం రాయాలనిపించింది. వచనకవిత్వంలో దీర్ఘకావ్యాలు అప్పటికి రాసినవాళ్ళు లేకపోలేదు. కాని నా ఊహ వేరే విధంగా ఉండింది. అదొక ఇతిహాసాన్ని తలపించేదిగా ఉండాలనే ఆకాంక్ష చాలా బలంగా ఉండేది
