ఆమె మాటల్తో ఏమీ జవాబివ్వకుండా తల అడ్డంగా ఊపింది. కానీ తన తల వాల్చి అతడు తన చేతిలో పట్టుకున్న ఆ పువ్వుపైనే చూపులు నిలిపింది. వాళ్ళిద్దరూ చాలాసేపు అలానే ఉండిపోయారు. ఆమె మళ్ళా తన కళ్ళెత్తి చూసేసరికి ఆ కళ్ళల్లో నీళ్ళు కదలాడుతుండటం అతడు చూసాడు.
తేనెటీగల కొలను-6
తాను ఆ కాగితంలో ఉన్న గీతాన్ని చదువుతున్నంతసేపూ ఆ కాగితం సూక్ష్మంగా కంపిస్తుండటం రైన్‌హార్డ్‌కు అనుభవమైంది. అతడు పఠించడం ముగించగానే ఎలిసబెత్ తాను కూర్చున్న కుర్చీ వెనక్కి జరిపి ఒక్కమాట కూడా మాట్లాడకుండా తోటలోకి వెళ్ళిపోయింది.
తేనెటీగల కొలను-4
రైన్‌హార్డ్ ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉండిపోయాడు. అప్పుడు ఆమె చెయ్యి తన చేతుల్లోకి తీసుకుని ఆమె నిర్మల నేత్రాల్లోకి గంభీరంగా చూస్తూ ‘నేను ఎప్పుడూ ఉన్నట్టే ఇప్పుడూ ఉన్నాను. ఆ విషయం నువ్వు నమ్మితే చాలనుకుంటున్నాను. నా మాట నమ్ముతావా, ఎలిసబెత్?’ అనడిగాడు.
