పుస్తకపరిచయం-36

పుస్తకపరిచయం ప్రసంగాల్లో భాగంగా కాళిదాసు మేఘసందేశం పైన చేస్తూ వస్తున్న ప్రసంగాల్లో ఇది పదహారవది. ఈ రోజు ఉత్తరమేఘంలో 45 వ శ్లోకం నుండి 57 వ శ్లోకం వరకు ముచ్చటించాను. దీనితో మేఘసందేశం పైన ప్రసంగ పరంపర పూర్తయింది. ఈ ప్రయాణంలో మేఘంతో పాటు కలిసినడిచిన వారందరికీ నా ధన్యవాదాలు. ఈ ప్రసంగాన్నిక్కడ వినవచ్చు.

పుస్తక పరిచయం-30

పుస్తక పరిచయం ప్రసంగాల్లో భాగంగా మేఘసందేశం కావ్యం గురించి చేస్తున్న ప్రసంగాల్లో ఇది తొమ్మిదవది. ఈ ప్రసంగంలో పూర్వమేఘం 50-67 శ్లోకాలు పరిచయం చేసాను. దీంతో గత రెండునెలల పైగా సాగుతున్న పూర్వమేఘ ప్రయాణం పూర్తయింది. ఈ ప్రసంగాన్నిక్కడ వినవచ్చు.

పుస్తక పరిచయం-19

పుస్తక పరిచయం ప్రసంగాల్లో భాగంగా ఇప్పటిదాకా ప్రేమగోష్ఠి, బైరాగి, టాగోరుల సాహిత్యం మీద పద్ధెనిమిది ప్రసంగాలు పూర్తయ్యాయి. ఈ రోజు అజంతా (1929-98) కవిత్వసంపుటి 'స్వప్నలిపి' పైన ప్రసంగించాను.