కబీరు-8

'వైరాగ్యంలోంచి మోక్షం నాకవసరం లేదు'. గీతాంజలి లోని ఈ 73 వ కవితనే కదా నా జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. దాదాపు నలభయ్యేళ్ళ కిందట, నా జీవితపరమార్థమేమిటనే తలపు లీలగా నాలో తలెత్తిన వేళ, మొదటిసారి గీతాంజలి చదివినప్పుడు, ఈ కవిత దగ్గరే కదా నేనాగిపోయాను.

సత్యమొక్కటే, దర్శనాలు వేరు గాంధీ, టాగోర్ సంవాదం

స్వాతంత్ర్యోద్యమసంగ్రామ కాలంలో దేశాన్ని జాగృతం చేసిన మహనీయుల్లో మహాత్మాగాంధి, రవీంద్రనాథ్ టాగోర్ ముందువరసలో నిలుస్తారు. గాంధీని టాగోర్ మహాత్మా అని సంబోధిస్తే, గాంధీ టాగోర్ ని గురుదేవ్ అని పిలిచేవారు. కాని, సహాయనిరాకరణోద్యమకాలంలో వారిద్దరి మధ్యా అభిప్రాయభేదాలు తలెత్తాయి. అదొక ఆసక్తికరమైన సంవాదంగా రూపుదిద్దుకుంది.ఆ సంవాదం కూడా జాతిని మరింత జాగృతం చెయ్యడానికే సహకరించింది.