వారిద్దరి ప్రసంగాలూ విన్నాక, ఇవి నన్ను వెన్నాడే కథలు మాత్రమే కాదు, అందర్నీ వెన్నాడే కథలు కూడా అని అర్థమయింది. ..
భూమన్ తో ఒక సాయంకాలం
మన సమాజ చరిత్రలో ఇదొక కొత్త అధ్యాయం. మనుషుల్ని కలపటానికి సినిమాలూ, రాజకీయాలూ, క్రీడలూ ఇవ్వగల స్ఫూర్తికన్నా ఈ కొత్త వ్యాపకం మరింత ఆరోగ్యవంతమైన ఉత్తేజాన్ని అందిస్తుందని నమ్ముదాం. అందుకు భూమన్ గారే ఒక ఉదాహరణ అన్నదే నిన్న అక్కడ కూడుకున్న మిత్రులంతా ముక్తకంఠంతో చెప్పింది.
