ప్రతి క్రతువూ ఒక ప్రతీకాత్మక పశువధ. ఆ పశువు బయటి పశువుగా ఉంటూనే లోపలి పశువుని కూడా సంకేతించడంలోంచే పురాణగాథలు పుట్టుకొచ్చాయి. ఆ పశువు ఒకటే పశువైతే మినోటారు, దానికి పదిముఖాలుంటే రామాయణం, వందముఖాలుంటే భారతం.
సాహిత్యవేత్త
శ్రీ సూరపరాజు రాధాకృష్ణమూర్తికి మనం సమకాలికులం కావడం మన అదృష్టమని భావిస్తాను. నేను ఎటువంటి సాహిత్యవేత్తకోసం అన్వేషిస్తుంటానో, అటువంటి సాహిత్యసహృదయుడు ఆయన.
