ఉత్తమ ఉపాధ్యాయులు

ఉపాధ్యాయుడు అన్నిటికన్నా మించి ఒక presence. అతడు తరగతి గదిలో అడుగుపెట్టగానే ఒక సువాసన ఆ గదిలో వీచినట్టుగా ఉండాలి. అతడు నోరుతెరవకముందే అతడి చూపులే పిల్లల్తో మాట్లాడటం మొదలుపెట్టాలి. అతడు చెప్పే పాఠంలోని విషయంకాదు పిల్లల్ని కట్టిపడేసేది, అసలు అతడు ఏం మాట్లాడినా పిల్లలు మంత్రముగ్ధులై పోగలగాలి.