ఒక మనిషి తాత్త్వికంగా సత్యాన్వేషణకు పూనుకోవడమంటే 'నీరస తథ్యాల్ని' తిరస్కరించడం. 'నిశ్చల నిశ్చితాల' ని పక్కకు నెట్టేయడం. కాబట్టే, సత్యాన్వేషణ అన్ని వేళలా సంతోషానికీ, మనశ్శాంతికీ దారితియ్యకపోగా, నిరంతర ఆత్మశోధనకీ, సంశయగ్రస్తతకీ, ఆత్మవేదనకీ దారితియ్యడం ఆశ్చర్యం కాదు. అలాగని మనం సత్యాన్వేషణని ఆపలేం. పక్కనపెట్టేయలేం. 'నిత్య నిరుత్తరపు ప్రశ్న జ్ఞానం ఇచ్చిన దానం' అని తెలిసికూడా మన వివేచనని కట్టిపెట్టలేం.
రెండు మూడు మాటలు
మన జీవితం ఇట్లాంటి సాధారణమైన మనుషులతోటే నిండి ఉంది. వీళ్ళు మన చుట్టూ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. వీళ్ళతో మనం ఎంత ఎక్కువ connect అయితే అంత మంచిది.
