నీ కట్టెదుట విధ్వసం సంభవిస్తున్నప్పుడు అది నీ ఆత్మలో విధ్వంసంగా పరిణమించాలి. మనిషిలోనో, భగవంతుడిలోనో నీ నమ్మకం కూకటివేళ్ళు తెగిపోయేటంతగా నువ్వు చలించిపోవాలి. ఏమి చేసి నిన్ను నువ్వు నిలబెట్టుకోగలవా, నీ ఆత్మని కాపాడుకోగలవా అని కొట్టుకుపోవాలి.
పునర్యానం-32
కాని ఆధునిక యుగం పతనావస్థకు చేరుకున్న కాలంలో నేనున్నాను. ఇది ఉత్సవసందర్భం కాదు, ఉద్రేకప్రకటనా నడవదు. ఇప్పుడు పలికేది ఒక ఆక్రందన, గుండెలు బాదుకోడం మాత్రమే. దానికి ఎక్కడ? ఏ కవిత్వం నుంచి నేను స్ఫూర్తి పొందగలనని ఆలోచించాను.
పునర్యానం-28 & 29
నా చిన్నతనంలో మా ఊళ్లో నేను చూసిన ఆ వసంత కాలానికీ, ఆ తీపి గాలులకీ, ఆ తేనెవాకలకీ ఇక్కడ నేను కళ్ళారా చూస్తున్న దుమ్ముకీ, దుఃఖానికీ మధ్య దూరం నా అంచనాకు అందలేదు.
