The Second Horizon

పునర్యానం నా మూడవ కవితా సంపుటి. 5000 పంక్తులకన్నా మించిన సుదీర్ఘ కావ్యం. ఆ పుస్తకానికి తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ వచన కవిత పురస్కారం కూడా అందించారు. ఆ పుస్తకం మొత్తాన్ని ఇంగ్లిషులోకి అనువదించడం అంత సులభం కాదు. అందుకని 60 కవితలు తీసుకుని మూడేళ్ళ కిందట ఇంగ్లిషులోకి అనువదించి ఇక్కడ మీతో పంచుకున్నాను. అప్పణ్ణుంచీ ఆ అనువాదాల్ని చిత్రికపడుతూనే ఉన్నాను. ఎట్టకేలకు, ఇలా The Second Horizon పేరిట bilingual edition ని ఇలా విడుదల చేస్తున్నాను. ఈ సాఫ్టు ప్రతిని ఇక్కణ్ణుంచి డౌనులోడు చేసుకోవచ్చు. పునర్యానం కావ్యాన్ని మా విజ్జికి కానుక చేసాను. ఇప్పుడు ఈ ఇంగ్లిషు అనువాదాన్ని ఆమె తండ్రి స్వర్గీయ పోరుమామిళ్ళ నారాయణరావుగారి స్మృతికి అంకితమిస్తున్నాను. ఇది నా 76 వ పుస్తకం.

పునర్యానం-60

అన్నం నుంచి ఆనందం దాకా ఒక చక్రమనీ, ఆనందలోకానికి చేరుకున్నాక నువ్వు తిరిగిమళ్ళా అన్నమయకోశంవైపు దిగి రావలసి ఉంటుందనీ ఋషి అంటున్నాడు. అంతేకాదు, ఆ స్థితికి చేరుకున్నాక 'అన్నం న నింద్యాత్' (అన్నాన్ని నిందించకండి), 'అన్నం బహు కుర్వీత'(అన్నాన్ని విరివిగా అందించండి) అంటున్నాడు.

పునర్యానం-59

పునర్యానం అయిదవ అధ్యాయంలో చివరి కవిత దగ్గరకు చేరుకున్నాం.  కథ వరకూ, కవి జీవితప్రయాణం వరకూ, ఈ కవితతో కావ్యం ముగిసిపోయింది. కాని ఇది కావ్యానికి ముగింపు కాదు. కావ్యంలో చివరి అధ్యాయం, కృతజ్ఞతా సమర్పణ మిగిలి ఉంది.