మేము ఆ ఊరు వెళ్తామని తెలిసి సోమశేఖర్ తాను కూడా వస్తానన్నాడు. రావడమే కాదు, తనే తన కారుమీద మమ్మల్ని ఆ ఊరు తీసుకువెళ్ళి తీసుకొచ్చాడు. ఆ రోజు అతడు కూడా ఆ గిరిజనదేవతను దర్శించుకున్నాడు. కాని అతడి హృదయంలో ఇన్ని రసతరంగాలు ఎగిసిపడుతున్నాయని నేను ఊహించలేకపోయాను.
వానపడ్డ రాత్రి
ఎప్పుడొచ్చాయో తెలీదు, ఒకరాత్రివేళ బాల్కనీలో, పోర్టికోలో, పచ్చిగడ్డివాసనతో ఆవుల మందలు.
ఇప్పటికి తెలిసింది
ఇన్నాళ్ళూ ప్రతిరోజూ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను నిత్యం నా కష్టసుఖాలు ఆయనకు చెప్పుకుంటూ వచ్చాను.
