ప్రభాతం తూర్పుదిక్కున అని అనుకోవడం ఒక నమ్మకం, సోమరి అలవాటు. చెట్లు మేలుకునే దృశ్యం చూసినదాకా నేనూ అలానే అనుకున్నాను.
కుహూరవం
నా ఎదుట ఉన్న ఫోటోలో చిన్నప్పటి ముఖాన్ని వెతుక్కున్నట్టు ఈ మార్చి ఎండలో ఒకప్పటి వసంతాన్ని పోల్చుకుంటున్నాను.
ఆ ఒక్క క్షణమే
సగం తవ్విపోసిన ఇనుపఖనిజం లాగా సికింద్రాబాదు రైల్వే స్టేషను.
