ఆ పసుపుపూలచెట్టు నిండుగా వికసించిందని చెప్పవచ్చు. కాని అది నా చుట్టూ సృష్టిస్తున్న ప్రకంపనల్ని పూర్తిగా వివరించినట్టు కాదు.
ఇంతకన్నా మరేం కావాలి?
తెలుగు వెంకటేష్ కి, కర్నూల్లో ఒక ఫుట్ పాత్ మీద, సెకండ్ హాండు పుస్తకాల మధ్య, నా నీటిరంగుల చిత్రం కవిత్వం దొరికిందని విన్నప్పుడు. ..
మధువిద్య
నీ ఇంటికొచ్చినవారిచేతుల్లో ఈ పూట ఒక పూలగుత్తి పెట్టు. ఎవరికి తెలుసు? కొత్త సంవత్సరం వారిచరణాలతో నీ ఇంట అడుగుపెడుతూండొచ్చు.
