రెండు వేల చదరపు కిలోమీటర్ల నగరంలో రెండున్నర వీథులు: ఒక మానవమహేతిహాసంలో నేను పునః పునః పఠించేదింతే.
జుగల్ బందీ
నిన్న సాయంకాలం సుర్ మండల్ వారు ఏర్పాటు చేసిన ఉత్తర్-దక్షిణ్ సంగీతసమారోహంలో జయతీర్థ్ మేవుండి, శశాంక్ సుబ్రహ్మణ్యంల జుగల్ బందీ విన్నాక.
నేనూ ఇంతే కద!
పండుగుమ్మడికాయమీద పరుచుకున్న పూతలా ఫిబ్రవరి సూర్యకాంతిమీద పలచని మంచుపొర.
