తొలి కూజితం

చాలా ఏళ్ళ కిందట బహుశా నా ఇరవయ్యేళ్ళప్పుడు ఒక తెల్లవారుజామున మగతనిద్రలో ఎవరివో మాటలు: మా అమ్మనెవరో ఏదో అడుగుతున్నారు మధ్యమధ్య మసకమసగ్గా నా పేరు.

చిత్రగ్రీవం

నోరారా ఎలుగెత్తి పిలుస్తున్నప్పుడే అనుకున్నాను ఆ కోకిల తన గొంతులో పూలూ, ముళ్ళూ రెండూ పొదువుకుందని.