వానాకాలంలో పొంగిపొర్లే ఏటిలాగా ఉరకలెత్తుతున్న వసంతం. నా కళ్ళముందే కొట్టుకుపోతున్నవి కాలం, గగనం, నగరం.
భగవంతుడి గులాబితోట
ఈసారి ఫాల్గుణమాసం ఉపవాసదీక్ష పాటిస్తోంది ఆకాశపు మీనారు లోంచి కోకిల వేకువనే ప్రార్ధనకు పిలుస్తోంది.
రసవితరణ
పగలంతా ఒక ప్రపంచం. ఎండ, దుమ్ము హారన్లు, పెట్రోలు, పొగ, పరుగులుపెట్టే రోడ్లు రాత్రయ్యాక, నెమ్మదిగా లోకం సద్దుమణిగాక తీపిగాలుల రెక్కల మీద పాటలు ప్రవహిస్తాయి
