నిర్వికల్ప సంగీతం (1986) నుంచి మరొక కవిత, నా ఇంగ్లిషు అనువాదంతో.
నీడల్లేని కాలం
ఆషాఢ మాసపు అపరాహ్ణాల్లో కొండలమీద పరుచుకునే మేఘాలనీడలు సాయంకాలపు గోధూళిమధ్య ఊరంతా ముంచెత్తే అంబారవాల నీడలు గ్రామాలకింకా కరెంటు రాని రోజుల్లో వెన్నెలరాత్రుల వెచ్చని నీడలు- అదొక కాలం.
భగవంతుడి చేతులు
ఈ రోజులెప్పటికీ ముగిసిపోవన్నంత సంతోషంతో ఎవరి చేతులు పట్టుకుని కరచాలనాలు చేసానో ఒప్పులకుప్పలాడానో. ..
