ప్రేమగోష్ఠి-13

తన కాలం నాటి ఏథెన్స్ మానసిక దాస్యాన్ని సోక్రటీస్ కలవపరిచాడనీ, తన రాజకీయ దాస్యాన్ని భరించలేని ఏథెన్స్, తమ మధ్య మానసికస్వతంత్రుడిగా ఉన్న సోక్రటీస్ ని బలిగొన్నదనీ ప్లేటో మరింత సూక్ష్మంగా, మరింత సాహిత్యప్రతిభతో సింపోజియం ద్వారా వివరిస్తున్నాడని మనం గ్రహించినప్పుడు ఈ రచన మరింత ఔన్నత్యాన్ని సంతరించుకుంటుంది.

ప్రేమగోష్ఠి-12

కాని ఒక సారి ఆ ప్రతిమవక్షం చీల్చి అందులో ఏముందో చూసారా, ఇక నిజంగా అర్థవంతమైన మాటలంటూ ఉంటే అవి మాత్రమే అనిపిస్తుంది. అంతకన్నా దివ్యభాష, అంతకన్నా శీలసమన్వితమైన భాష మరొకటి లేదనిపిస్తుంది. అంత సమగ్ర అవగాహనతో, ఆ మాటకొస్తే, ఒక సజ్జనుడు, వందనీయుడు మాట్లాడవలసిన పద్ధతి అదే అనిపిస్తుంది.'

ప్రేమగోష్ఠి-11

తక్కిన ప్రపంచం ఏ సౌందర్యం ఎదట, సిరిసంపదల ఎదట, గౌరవప్రతిష్టల ఎదట సాష్టాంగ పడిపోతుందో, వాటిపట్ల అతడికి కించిత్తు కూడా దృష్టిలేదు. ఇంకా చెప్పాలంటే వాటి పట్ల అతడికి చెప్పలేనంత ఏహ్యత. అందం, సంపద, హోదా ఉన్నవారిని  భాగ్యశాలురని అతడు ఎన్నటికీ అనుకోలేడు. అసలు మానవాళిని తృప్తిపరచడం పట్ల అతడికెటువంటి ఆసక్తీ లేదు.