ఆ ఒక్క ప్రశ్న ఒక తేనెతుట్టెని కదిపినట్టయింది. ఎక్కడెక్కడి జ్ఞాపకాలూ, ఎక్కడెక్కడి మిత్రులూ, ఎప్పటెప్పటి కవిత్వాలూ గుర్తొచ్చాయి. 'మహాసంకల్పం' నుండి ట్రాన్స్ ట్రోమర్ దాకా. బైరాగి నుంచి కవితాప్రసాద్ దాకా.
రారా పోదాం రారా పోదాం
వారం రోజుల కిందట మూలా సుబ్రహ్మణ్యం మా ఇంటికొచ్చాడు. ఆయన వస్తున్నాడని తెలిసి నందకిశోర్ కూడా వచ్చాడు. నందూ వచ్చాక పాటలు రాకుండా ఎలా ఉంటాయి?
మునిగి తేలాం
ఒకరు కాదు, ఇద్దరు కథానాయకులు-ఒకరు నింగిలో, మరొకరు నీళ్ళల్లో. నిజానికి గగగనసీమలోని చంద్రుడికన్నా, సరోవరంలోని చంద్రుడే ఎక్కువ గ్లామరస్ గా ఉన్నాడు.
