గాలినాసరరెడ్డికి లేఖలు

అందుకనే అనిల్ బత్తుల సంకలనం చేసిన 'గాలినాసరరెడ్డికి లేఖలు, 1982-2012' (బోధి ఫౌండేషన్, 2025) నా చేతికి అందగానే మొత్తం 86 ఉత్తరాలూ ఏకబిగిని చదివేసాను. ఇంతకీ ఇవి నాసరరెడ్డి రాసిన లేఖలు కావు, నాసరరెడ్డికి కవిమిత్రులు రాసినవి. అంటే కవిని నేరుగా చూడకుండా అద్దంలో చూసినట్టుగా అన్నమాట.