మనుషులూ దేవతలూ కలిసి నిర్మిస్తే తప్ప ఒక మనిషి మనిషిగా రూపొందలేడని గుర్తుపట్టాడు ఆయన, అందుకనే తన గ్రంథం మొదటి అధ్యాయాన్ని మనుషులకీ, దేవతలకీ కృతజ్ఞతా సమర్పణగా రాసుకున్నాడు.
ఈ ప్రపంచం మంచికే
నేనన్నాను: 'ఎందుకు కాదు? నేనొక నది ఒడ్డున నిల్చున్నాను. కొన్ని క్షణాల ప్రశాంతి పొందాను. దాన్నిప్పుడిలా నలుగురితో పంచుకోలేదా!' అని.
నువ్వెప్పటికీ స్వతంత్రుడివే.
వినయంగా మసలుకోడానికీ, ఇతరులకు సేవచేయడానికీ, భగవంతుణ్ణి అనుసరించడానికీ నువ్వెప్పటికీ స్వతంత్రుడివే.
