మెడిటేషన్స్-10

సుఖాన్ని స్వీకరించగలం మనం ఉత్సాహంగా, కాని దుఃఖం ప్రాప్తించినప్పుడే, మనం స్తిమితం తప్పుతాం. అప్పుడే తోటిమనిషినీ, దేవుణ్ణీ నిందించడం మొదలుపెడతాం. కాని సుఖదుఃఖాలు రెండింటినీ స్వాగతనేత్రాల్తో స్వీకరించి కూడా తన స్తిమితం కోల్పోకుండా ఉండటం, అదీ తన ఆనందం అని చెప్తున్నాడు అరీలియస్

మెడిటేషన్స్-9

ప్రపంచాన్ని పట్టించుకో. ప్రపంచ అభిప్రాయాన్ని పట్టించుకోకు-ఇదీ అరీలియస్ పదే పదే తనకి తాను చెప్పుకుంటున్న విషయం.

మెడిటేషన్స్-8

ఈ మాటలు నాకు చాలా నచ్చాయి. మనం పూర్తిగా పాటించగలిగినా, పాటించలేకపోయినా కూడా మనకై మనం పెట్టుకున్న ఆ శీలపారమితలోనే మనకి నిజమైన తృప్తి, ధైర్యం, నిలకడ అని మనం గుర్తుపెట్టుకోవాలి. శీలవిద్య మనం ట్యూషన్ లాగా పదే పదే చెప్పించుకోవలసింది కాదు. పదే పదే మనకు మనం చెప్పుకోవలసింది.