ప్రపంచానికి రాసుకున్న ఉత్తరాలు

రెండేళ్ళ కిందట 'పోస్టు చేసిన ఉత్తరాలు' నా బ్లాగులో రాస్తున్నప్పుడు వాటికి మొదటిపాఠకురాలు మానసనే. ఇప్పుడు పుస్తకంగా వెలువరించినప్పుడు కూడా ఆమెనే మొదటిపాఠకురాలిగా తన అద్భుతమైన స్పందనని ఫేస్ బుక్కులో తన వాల్ మీద పంచుకున్నారు. ఆ అపురూపమైన వాక్యాల్ని మీతో పంచుకోకుండా ఎలా ఉంటాను!

రాజమండ్రి డైరీ

ఇది నా 46 వ పుస్తకం. దీంతో, ఉత్తరాలు, నాటకం, నృత్యరూపకం ప్రక్రియలు తప్ప తక్కిన అన్ని సాహిత్యప్రక్రియల్లోనూ నా రచనలు వెలువడినట్టే.

వర్షం కురిసిన మైదానాల్లో

నా ఇరవై ఏళ్లప్పుడు నా ‘శరణార్థి’ కథను రాజమండ్రిలో, శరభయ్య గారు ఇలానే చదివి, ఒక్కొక్క వాక్యాన్నే ఎత్తిచూపుతో, ఇట్లానే తన స్పందన పంచుకున్నారు. ఈసారి నా చిత్రలేఖనాలకు అటువంటి స్పందన లభించింది.