దిజ్ఞాగుడి విశిష్టత ఎక్కడుందంటే అతడు ఆమెని అంటిపెట్టుకున్న ఆ మట్టివాసన చెదిరిపోకుండా చూసుకున్నాడు. అతడు చిత్రించిన సీత ఒక మనిషి. నిస్సహాయ, నిర్దోషి సరే, ప్రేమ, ఇష్టం, ఉద్వేగం, ఉక్రోషం అన్నీ కలగలిసిన నిండు మనిషి. ఆ నాటకం పొడుగునా మనమొక నిజమైన స్త్రీని చూస్తున్న హృదయావేగానికి లోనవుతాం