ఇలా ఏదో నీలమూ, ఆకుపచ్చా కలగలసిన ఒక మరకగా ఆ కథ నాకు గుర్తుండిపోయింది. ఆతృతగా పుస్తకం ముందుకీ వెనక్కీ స్క్రోలు చేస్తూ ఉన్నాను. కానీ మొత్తం కథలన్నీ మరోసారి చదవనక్కర్లేకుండానే ఆ కథ దొరికింది.
నన్ను వెన్నాడే కథలు-14
నలభయ్యేళ్ళ కింద నేను చదివిన కథల్లో బహుశా అత్యంత విషాదాత్మకమైన కథ లేదా మరోలా చెప్పాలంటే అత్యంత fatal short story కాఫ్కా రాసిన TheJudment (1912). ఎందుకంటే ఈ కథ చదివాకనే నా మిత్రుడు కవులూరి గోపీచంద్ మా అందరికీ మానసికంగానే కాక, భౌతికంగా కూడా, దూరమైపోయాడు.
సమగ్రంగా వికసించిన పాఠశాల
ఆ పసివయసులో చందమామ పత్రిక నాకేమి చెప్పిందంటే, ఆ ఇద్దరు చంద్రుళ్ళూ కూడా నిజమేనని. ఒకరికొకరు విరుద్ధం కారని. నవీన చంద్రుడు నా బుద్ధిని ఆకర్షిస్తాడు. పురాణ చంద్రుడు నా మనసుని దోచేసుకున్నాడు
