ఆషాఢ మేఘం -24

ప్రవాసితులందరి హృదయాల్లోనూ గూడుకట్టుకున్న విరహవేదనకి ఆయన తన కవితద్వారా ఒక గొంతునిచ్చాడు. యుగాలుగా అణచిపెట్టుకున్న దుఃఖం ఆయన కవిత్వధారలో జలజలా కురవడం ఈ కవితచదువుతున్నంతసేపూ మనకి తెలుస్తూనే ఉంటుంది. బహుశా, మేఘసందేశం కావ్యానికి ఇంతకన్నా ఘననీరాజనం మరొకరు సమర్పించలేరేమో!

ఆషాఢమేఘం-23

కాకపోతే ఆ ఉజ్జయిని నగరంలో గతం, వర్తమానం అన్నీ ఉదయనకథాగానమే. మరో విశేషం లేదు. ఆ ఉదయనుడు ఎవరో గాని, మన తీరికసమయాల్ని ఎంతగా లోబరచుకున్నాడు! లేకపోతే, ఈ ఆషాఢప్రభాతాన నేనిట్లా కూచుని పరగడుపున మళ్ళా ఆ కథలే మీతో ముచ్చటించడమేమిటి!

ఆషాఢమేఘం-22

ఇది కదా, ఒక కవిని కన్నందుకు, ఆ ఊరికి లభించే భాగ్యం! మరో కవి ఎవరేనా ఉన్నారా? ఇలా ఒక మేఘాన్ని తన ఊరికి ఆహ్వానించి అక్కడి విశేషాలన్నీ దగ్గరుండీ మరీ చూపించడానికి ఉత్సాహపడ్డ కవి!