నువ్వు తప్ప, కవీ, ఆ లక్ష్మీధామానికి నన్ను మరెవ్వరు తీసుకుపోగలరు? అక్కడ సకలసంపదలమధ్య శోకిస్తున్న ఆ ప్రియసన్నిధికి?
శ్రీకృష్ణలీలా తరంగిణి
నిన్న మళ్ళా కృష్ణలీలా తరంగిణి మీద మాట్లాడటానికి కూచున్నప్పుడు గీతగోవింద కావ్యం లో కన్నా కూడా అందులో విస్తృతీ, వైవిధ్యం మరింత ఉన్నాయనిపించింది. ఆ మాటే చెప్పాను అక్కడ. గీతగోవింద కావ్యానికి జీవితకాల ఆరాధకుడిగా నేనా మాటలు చెప్పడం నాకే ఆశ్చర్యమనిపించింది. కానీ ఏం చెయ్యను? కృష్ణలీలాతరంగిణి మహిమను నేనిన్నాళ్ళూ గుర్తించవలసినట్టుగా గుర్తించలేదేమో అనిపించింది.
ఆషాఢమేఘం-30
రామాయణ వర్షాన్ని భాగవత వర్షంతో పోలిస్తే వెయ్యేళ్ళ కాలంలో భారతీయ దృక్పథంలో ఎటువంటి మార్పు వచ్చిందో మనకి తేటతెల్లంగా తెలుస్తూ ఉంది. తత్పూర్వ కవిత్వాలు ఇంద్రియతాపాన్ని రగిలించేవిగా ఉండగా, భాగవత వర్షం ఇంద్రియతాపాన్ని శంపింపచెయ్యడం మీదనే దృష్టిపెట్టిందని మనకి సులభంగానే బోధపడుతుంది.
