మేము ఆ ఊరు వెళ్తామని తెలిసి సోమశేఖర్ తాను కూడా వస్తానన్నాడు. రావడమే కాదు, తనే తన కారుమీద మమ్మల్ని ఆ ఊరు తీసుకువెళ్ళి తీసుకొచ్చాడు. ఆ రోజు అతడు కూడా ఆ గిరిజనదేవతను దర్శించుకున్నాడు. కాని అతడి హృదయంలో ఇన్ని రసతరంగాలు ఎగిసిపడుతున్నాయని నేను ఊహించలేకపోయాను.
