మనిషిగా, సత్యాన్వేషిగా భాస్కరం సంస్కారం అత్యున్నతమైంది కాబట్టే ఈ రచన కూడా ఇంత అద్వితీయంగా రూపొందింది అని నమ్ముతున్నాను.
ముందుయుగం దూత
అంతర్జాతీయమార్కెట్ మీద నువ్వు తిరుగుబాటు ప్రకటించాలనుకుంటే అందుకు నీదైన జీవనశైలిని నువ్వు నిర్వచించుకోవాలి, నీ సౌందర్యదృక్పథాన్ని నువ్వేర్పరచుకోవాలి, నీ నమూనాల్ని నువ్వు రూపొందించుకోవాలి. అప్పుడు మాత్రమే నీ మార్కెట్లను నువ్వు జయించగలుగుతావు.
