ఆషాఢమేఘం-15

గాథాసప్తశతిలో కనిపించే స్త్రీపురుషప్రేమకీ తర్వాత రోజుల్లో కావ్యప్రపంచాన్ని పరిపాలించిన ప్రేమకీ మధ్య చాలా తేడా ఉంది. ప్రాకృత కవిత్వంలో కనిపించే ప్రేమ స్త్రీపురుషుల మధ్య సహజంగా వికసించే అత్యంత లౌకిక ప్రేమ, గ్రామీణ ప్రేమ. దేహాలనూ, మనసులనూ కలిపే ప్రేమ.

రూపకప్రజ్ఞ

'మీరు కవిత రాసేముందే మెటఫర్లు పట్టుకుంటారా లేకపోతే కవితరాస్తూండగానే అవి కూడా దొర్లుకొస్తాయా' అనడిగిందొక మిత్రురాలు.

ఒకప్పుడు కవిత అంటే శబ్దం, సంగీతం.