ఒక అడుగు ముందుకు తీసుకువెళ్లిన రచన

తాను ఏ డోంగ్రియా కోదు జీవితాన్ని వర్ణిస్తున్నాడో ఆ ఆదివాసుల్ని ఈ రచయిత చాలా దగ్గరగా చూసాడనీ, చాలాచోట్ల వారితో మమేకమయ్యాడనీ, వారిని మాత్రమే కాదు, వారి దేవతల్ని కూడా దగ్గరగా చూసాడనీ ఈ నవల సాక్ష్యం చెప్తున్నది.

వారికి నా కైమోడ్పు

ఆ అధికారుల్లో సుబ్రహ్మణ్యంగారిది చాలా ప్రత్యేకమైన స్థానం. కాకపోతే, తన ఉద్యోగ జీవితపు తొలిరోజుల్లో పనిచేసిన ఒక సంస్థలోని ఉపాధ్యాయుల పేర్లు గుర్తుపెట్టుకుని ఇన్నేళ్ళ తరువాత ఇలా వారి గురించి ఎవరు రాయగలుగుతారు