నా భిక్షాపాత్ర నిండింది

ఈసారి కూడా అలాగే మరో వంద డాలర్ల మేరకు పుస్తకాలు తెస్తానంటే కాదన లేకపోయాను. అందుకని, ఇదుగో, ఈ పుస్తకాలు తెప్పించుకున్నాను. పుస్తకాల కోసమైతే నా భిక్షాపాత్ర ఎత్తిపట్టుకోడానికి నాకెప్పటికీ సంతోషమే.

పోస్టు చేసిన ఉత్తరాలు-7

నిజమే, ఈ వార్తలు ప్రపంచానికి అక్కర్లేదు. కానీ ప్రపంచం పసిది, దానికేం తెలుస్తుంది? చూడు, ఆకాశమూ, సూర్యరశ్మీ తనకు అవసరంలేదన్నట్టే ఉంటుంది పొద్దున్న లేచి దాని నడవడి. కాని అవి లేకపోతే ప్రపంచం క్షణం కూడా మనజాలదని మనకు తెలుసు. అందుకనే నిజమైన కవి తనని తాను ముందు భగవంతుడి వార్తాహరుడిగా నియమించుకుంటాడు.

పోస్టు చేసిన ఉత్తరాలు-6

ఒక మనిషికి జన్మమృత్యువుల విలువ తెలియాలంటే ఎంతమంది మనుషులు పరిచయం కావాలి? ఎంతమంది కనుమరుగు కావాలి? నీకు నిజంగా ప్రాణం విలువ తెలిస్తే, కృష్ణమూర్తి జీవితంలో సంభవించినట్టుగా, ఒక్క మృత్యువు చాలు, నిన్ను అంతర్ముఖం చెయ్యడానికి.