వర్షం కురిసిన మైదానాల్లో

నా ఇరవై ఏళ్లప్పుడు నా ‘శరణార్థి’ కథను రాజమండ్రిలో, శరభయ్య గారు ఇలానే చదివి, ఒక్కొక్క వాక్యాన్నే ఎత్తిచూపుతో, ఇట్లానే తన స్పందన పంచుకున్నారు. ఈసారి నా చిత్రలేఖనాలకు అటువంటి స్పందన లభించింది.

ఎమిల్ నోల్డె

ఎమ్మెస్ తన కవితాసంపుటి 'శబ్దభేది'కి ముఖచిత్రం వెయ్యమని అడిగినప్పుడు ఒక పువ్వూ, దానిమీద వాలిన ఒక సీతాకోకచిలుకా స్ఫురించాయి. వాటిని నీటిరంగుల్లో ఎమిల్ నోల్డె లాగా చిత్రించాలని కూడా అనిపించింది.