వెళ్ళిపోతున్న వసంతం

పొద్దున్నే ఇంకా తెల్లవారకుండానే కోకిల ఒకటే గీపెడుతూ ఉంది. ఆ పిలుపు భరించడం కష్టంగా అనిపించింది. ఆ పిలుపులో ఏదో దిగులు, ఆపుకోలేని ఆత్రుత ఉన్నాయి. కాని లేవబుద్ధి కాలేదు. నాకు తెలుస్తూనే ఉంది, కోకిల దేనికి అంతలా తన నెత్తీ నోరూ మొత్తుకుంటోందో.

ఒక ఇల్లు కట్టుకోవాలి

నా కూతురుకి ఇళ్ళూ, పొలాలూ, తోటలూ, బంగారమూ ఎలానూ ఇవ్వలేను, కనీసం ఈ చిత్రకళాభాండారమన్నా ఇవ్వలేకపోతే ఎలా?

మరోసారి ఇల్లు మారాను

ఒకవేళ నా జీవితం ఇన్నేళ్ళుగానూ అక్కడే గడిచిఉంటే ఎలా ఉండిఉండేది? నేను చూసిన తావులు, చదువుకున్న చదువులు, కలుసుకున్న మనుషులు, చేపట్టిన ప్రయత్నాలు ఏవీ లేకుండా, అక్కడే ఉండిపోయుంటే ఎలా ఉండి ఉండేవాణ్ణి?